మోచేతిపై దెబ్బ తగిలితే జివ్వుమంటుంది.. ఎందుకు అలా? - TNews Telugu

మోచేతిపై దెబ్బ తగిలితే జివ్వుమంటుంది.. ఎందుకు అలా?ఒంటిపై ఎక్కడ దెబ్బ తగిలినా తట్టుకోగలమేమో గానీ.. మోచేతి మీద దెబ్బ తగిలితే మాత్రం అస్సలు తట్టుకోలేం. కరెంట్ షాక్ తగిలినట్టుగా జివ్వుమంటుంది. వేలి చివరి నుంచి జివ్వుమంటూ.. కొద్దిసేపటి వరకు స్పర్శ కూడా తెలియదు. అసలు ఎందుకిలా అవుతుందో తెలుసా? ఇది పూర్తిగా చదవండి తెలుస్తుంది.

elbow shock unknown facts
elbow shock unknown facts

మోచేతిపై దెబ్బ తగిలితే జివ్వుమనగానే.. మామూలుగా ఎముకకు తగిలింది అనుకుంటారు. కానీ ఆ దెబ్బ తగిలేది.. ఎముకకు కాదు.. నరానికి. నరానికి దెబ్బ తగలడం వల్ల కొన్ని క్షణాల పాటు రక్తం ఆగిపోయి ఆ పార్ట్ అంతా జివ్వుమంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. మన శరీరీరంలో ఉండే నరాలన్నీ ఒక్కో భాగం నుంచి ఒక్కో భాగానికి కనెక్ట్ అయి ఉంటాయి. వివిధ శరీర భాగాల నుంచి సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంటాయి. ఈ క్రమంలోనే మోచేతి దగ్గర ఉండే నరాలు చాలా యాక్టివ్ గా, సున్నితంగా ఉంటాయి. అంతేకాదు.. కాస్త బయటకు ఉబ్బినట్టుగా ఉంటాయి.

elbow shock unknown facts
elbow shock unknown facts

ఈ నరాన్ని అల్నార్ నరం అంటారు. దీనికి కాస్త దెబ్బ తగిలినా.. స్పర్శ కొంచెం ఎక్కువగా తగిలినా జివ్వుమంటూ యాక్టివ్ అవుతుంది. శరీరానికి ఏదో దెబ్బ తగిలింది అనే సంకేతాన్ని మెదడుకు పంపి.. బ్రెయిన్ ను ఉత్తేజపరుస్తుంది. అందుకే మోచేతిపై దెబ్బ తగలగానే వెంటనే చేతిని వెనక్కి లాగేసుకుంటాం. అల్నార్‌ నరం.. చిటికెన, ఉంగరపు వేళ్ల చివరి భాగం నుంచి వెన్నెముక, మెడ మీదుగా మెదడు వరకు వ్యాపించి ఉంటుంది. మోచేతి కీలు దగ్గర ఉండే నరానికి రక్షణ తక్కువగా ఉంటుంది. దాని మీద ఉండే చర్మం కూడా పలుచగా ఉటుంది. దీంతో.. దెబ్బతగిలినప్పుడు అది నేరుగా నరంపై ప్రభావం చూపిస్తుంది. ఎముక ఉపరితలానికి, ఢీ కొట్టిన వస్తువుకు మధ్య నరం ఇరుక్కుపోయి ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయి.. కరెంట్‌ షాక్‌ తగిలినట్లు జివ్వుమంటూ స్పర్శ కోల్పోతాము. కొన్నిసార్లు కళ్లు బైర్లు కమ్మినట్లు కూడా అవుతుంది.