పెట్రో ధరల కట్టడికి అత్యవసర చమురు నిల్వలు రిలీజ్..!

Crude-Oil

పెట్రో ధరల కట్టడికి అత్యవసర నిల్వల నుంచి దాదాపు 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును బయటకు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరల నేపథ్యంలో ఇప్పటికే అమెరికా, జపాన్‌ సహా పెద్ద దేశాలు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి.

గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలను అదుపులో పెట్టేందుకు భారత్‌కు ఉన్న వ్యూహాత్మక నిల్వ కేంద్రాల నుంచి దాదాపు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వలను విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఈ చమురును మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌(ఎంఆర్‌పీఎల్‌), హెచ్‌పీసీఎల్‌కు విక్రయించనున్నారు. దీంతో పెట్రో ధరలు అదుపులోకి వస్తాయని కేంద్రం భావిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.