జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం.. భారీగా ఆయుధాలు, కరెన్సీ స్వాధీనం - TNews Telugu

జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం.. భారీగా ఆయుధాలు, కరెన్సీ స్వాధీనం2 terrorists killed in encounter in North Kashmir's Bandipora: J&K Police

జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. యూరిలోని రాంపూర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి వచ్చేందుకు యత్నించగా.. భారత బలగాలు గుర్తించడంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

మొత్తం ఆరుగురు అక్రమంగా భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా.. ముగ్గురు హతమయ్యారు. మరో ముగ్గురి కోసం ఆర్మీ బలగాలు గాలిస్తున్నాయని శ్రీన‌గ‌ర్ చినార్ కార్ప్స్ ఆఫీస‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ డీపీ పాండే చెప్పారు.

ముగ్గురు ఉగ్రవాదులు దగ్గర నుండి 5 AK రైఫిల్స్, 24 UBGL, 7 హ్యాండ్ గ్రెనేడ్‌లు, రూ.35 వేల ఇండియన్, పాకిస్తానీ కరెన్సీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.