తెలంగాణలో మహమ్మారి తగ్గుముఖం.. కొత్తగా 2,175 కేసులు - TNews Telugu

తెలంగాణలో మహమ్మారి తగ్గుముఖం.. కొత్తగా 2,175 కేసులుతెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,175 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కొవిడ్‌ కారణంగా మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 3,821 మంది కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 253 మందికి పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.