తెలంగాణ యూనివర్శిటీలలో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ కు కామన్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కామన్ నియామక బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 16ను జారీ చేసింది.
మెడికల్ వర్సిటీలు మినహా మిగిలిన 15 యూనివర్సిటీల్లో ఖాళీలను కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు భర్తీ చేయనుందని ప్రభుత్వం తెలిపింది. బోర్డ్ చైర్మన్ గా ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వ్యవహరించనున్నారు. అలాగే కన్వీనర్ గా కళాశాల విద్య కమిషన్ మెంబర్, బోర్డు సభ్యులుగా విద్యాశాఖ, ఆర్ధిక శాఖ కార్యదర్శులు నియమితులయ్యారు.