వామ్మో.. అమిత్ షా తాగే వాటర్ బాటిల్ ధర రూ. 850

భవిష్యత్తులో గల్ఫ్ దేశాలకు నీటిని ఎగుమతి చేసే రోజులోస్తాయని గోవా వ్యవసాయ శాఖ మంత్రి రవి నాయక్ అన్నారు. గోవాలో వర్షపు నీటిని కాపాడుకోవడం గురించి మంత్రి మాట్లాడారు. ‘భవిష్యత్తులో నీటి రేటు బంగారం, వజ్రాల స్థాయిలోకి చేరుకుంటుందని అమెరికా వార్తాపత్రిక ఒకటి ప్రచురించింది. అందుకే నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది’ అని రవినాయక్ అన్నారు. దీనికి ఉదాహరణగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విషయాన్ని తెలియజేశారు.

అమిత్ షా గోవా పర్యటనలో ఉన్న సమయంలో హిమాలయ వాటర్ బాటిల్ అడిగారు. ఆ బాటిల్ ఆ సమయంలో అక్కడ దొరకలేదు. దాంతో పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మపుసా నుంచి తీసుకొచ్చాం. ఆ వాటర్ బాటిల్ ధర రూ. 850. గోవాలోని స్టార్ హోటళ్లలో కూడా మినరల్ వాటర్ బాటిళ్ల ధర రూ. 150 నుంచి రూ. 160 వరకు పలుకుతోంది. నీటి విలువ ఎంత పెరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గోవాలో ప్రతి సంవత్సరం 120 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది. పర్వతాలు ఉన్న చోట, అక్కడక్కడా డ్యామ్‎లు నిర్మించి.. ఈ నీటిని కాపాడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశముంది. అప్పుడు ప్రజలు నీటి కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకునే పరిస్థితి వస్తుంది. జలవనరులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తే.. వారే డ్యామ్‎లు కట్టి నీటిని కాపాడుతారు.