మరింత మెరుగ్గా 108 సేవలు: మంత్రి హరీష్ రావు

Minister Harish Rao

కోఠి డీఎంఈ కార్యాలయంలో సీఎస్ఆర్ కింద MOBIS INDIA FOUNDATION అందించిన రూ.1.41 కోట్ల విలువైన 7 అంబులెన్స్ లను ఆరోగ్య మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా లాంటి పరిస్థితుల్లో అంబులెన్స్ లను ఇవ్వడం సంతోషకరమన్నారు. టీచింగ్ ఆసుపత్రిలో ఈ వాహనాలు వినియోస్తారని మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో 108 వాహనాలు 429 ఉన్నాయన్న హరీష్ రావు.. వీటితో మరింత మెరుగ్గా 108 సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాత వాహనాలు తొలగించి అవసరం అయిన చోట కొత్త వాహనాలు కూడా అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు.

నాలుగు హెచ్ఓడీలను పూర్తి స్థాయిలో రివ్యూ చేశామని, హైదరాబాద్ లో నాలుగు అసపత్రుల సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలో హైదరబాద్ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రులను సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని హరీష్ చెప్పారు.  గాంధీలో క్యాథ్ ల్యాబ్ సేవలు పునరుద్దరణకు ఆదేశాలు ఇచ్చామన్నారు.