రైతులకు సాయం చేస్తే కూడా చిల్లర రాజకీయాలా?-మంత్రి నిరంజన్ రెడ్డి

Niranjan_Reddy

రైతులకు సాయం చేస్తే కూడా కాంగ్రెస్‌, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పోరాడి అసువులుబాసిన రైతులకు అండగా నిలవాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. రైతుల పోరాట ఫలితంగానే ప్రధాని మోదీ సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారా. అలాంటి రైతులకు సాయం చేయటాన్ని అభినందించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటన్నారు. రైతులకు చేస్తున్న సాయం పై విపక్షాలు విమర్శలు మానాలని ఆయన సూచించారు. రైతుల కోసం ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రైతుబీమా ప్రవేశ పెట్టింది కేసీఆర్ మాత్రమేనని ఆయన చెప్పారు. తెలంగాణలో ఇప్పటివరకు 80 వేల 755 కుటుంబాలకు రైతుబీమా అందించామన్నారు. కాగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబీమా పథకం అమలు చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని చెప్పారు. ఇకనైనా విమర్శలు మాని రైతులకు మంచి చేసే ప్రయత్నం చేయాలని ఆయన విపక్షాలకు సూచించారు.