‘రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి పట్టిన శని’ - TNews Telugu

‘రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి పట్టిన శని’Former MLA Kusukuntla Prabhakar Reddy has demanded that Rajagopal Reddy should apologize to Minister Jagadish Reddy

మునుగోడు నియోజకవర్గానికి పట్టిన శని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అన్నారు టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. నిన్న చౌటుప్పల్ లో రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన దౌర్జన్యాన్ని ఎండగడుతూ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడని అన్నారు.

ప్రజలను, తోటి ప్రజాప్రతినిధులను గౌరవించే విజ్ఞత, సంస్కారం రాజగోపాల్ రెడ్డి కి లేవని అన్నారు. తక్షణమే మంత్రి జగదీష్ రెడ్డి కి రాజగోపాల్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి జరగం ఇష్టం లేకనే రాజగోపాల్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని, ఆయన రౌడీయిజం ఇక నడవదని హెచ్చరించారు. పూటకో మాట మాట్లాడే రాజగోపాల్ రెడ్డికి మతిస్థిమితం కూడా సరిగా ఉండదని, ఆయన్ను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తామని అన్నారు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.