శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం

Explosives found in Sabarimala Thiruvabharanam procession route

శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. శబరిమల ఆలయ పరిసర ప్రాంతంలో నిషేధిత పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెన్​ఘాట్ బ్రిడ్జి కింద ఆరు జిలెటిన్​ స్టిక్స్​ను స్వాధీనం చేసుకున్నారు. బాంబు స్క్వాడ్ సాయంతో సోదాలు చేపట్టారు. ఇదే మార్గంలో స్వామివారికి బంగారు ఆభరణాలను తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో తిరువాభరణం పాత్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పీజీ శశికుమార వర్మ, జనరల్ సెక్రటరీ ప్రసాద్ కుజిక్కల ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని సూచించారు