తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది.
ఫిబ్రవరి 4 వరకు గడువు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 24 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.
గతంలో జనవరి 24 లోపల ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే.