ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు పొడిగింపు

election campaigns

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు కొనసాగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. భౌతిక ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధాన్ని జనవరి 22వ తేదీ వరకు పొడిగించింది.

300 మందితో లేదా హాల్ లో 50% కెపాసిటీతో ఇండోర్ మీటింగ్స్ కు అనుమతి ఇచ్చిన ఈసీ.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు, కోవిడ్ మార్గదర్శకాలకు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండేలని ఆదేశించింది.

ఎన్నికల నియమావళి, కోవిడ్ నిబంధనలు రాష్ట్ర/జిల్లా అధికారులు అమలు చేయాలని ఈసీ ఆదేశించింది. ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ, ఐదు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఎన్నికల ప్రధాన అధికారులతో వేరు వేరుగా సమావేశం నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.