ట్రైన్‌ల‌లో విస్తృతంగా త‌నిఖీలు.. రైల్వేకి భారీ ఆదాయం

railway

క‌రోనా సమయంలో చాలా రోజ‌ల పాటు రైళ్లు నడ్వలేదు. దీంతో రైల్వే ఆదాయం ఘోరంగా ప‌డిపోయింది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో కేంద్రం కొన్ని ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపింది. ఇప్పుడిప్పుడు రైల్వే ఆదాయం ప‌ట్టాలెక్కుతోంది.

రైల్వే అధికారులు కూడా అదనపు ఆదాయంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ట్రైన్‌ల‌లో విస్తృతంగా త‌నిఖీలు చేప‌డుతున్నారు. అధికారులు బృందాలుగా విడిపోయి, త‌నిఖీలు చేస్తున్నారు.

టిక్కెట్ లేని ప్ర‌యాణికులను పట్టుకొని వారి నుంచి భారీగా జ‌రిమానాలు వ‌సూలు చేస్తున్నారు.  ఆరు నెల‌ల్లోనే రూ.100 కోట్ల ఆదాయం రైల్వేకు స‌మ‌కూరింద‌ని రైల్వే అధికారులు చెప్పారు.

ఏప్రిల్ నెల మొద‌లు డిసెంబ‌ర్ 5 తారీఖు వ‌ర‌కూ విస్తృతంగా త‌నిఖీలు చేప‌ట్టామ‌ని, టిక్కెట్ లేకుండా ప్ర‌యాణిస్తున్న వారి నుంచి జ‌రిమానాలు వ‌సూలు చేశామ‌ని రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు.