పాతబస్తీలో దారుణం.. మంత్రాల పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

హైదరాబాద్ లోని పాతబస్తీలో దారుణం జరిగింది. చేతబడి చేస్తానని చెప్పి ఓ ఫేక్ బాబా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారినికి పాల్పడ్డాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని కాపాడమని ఇద్దరు యువతులు పాతబస్తీలోని ఓ బాబాను ఆశ్రయించారు. గత కొన్నిరోజులుగా తల్లికి వైద్యం చేస్తున్న బాబా ఇద్దరు యువతులపై కన్నేశాడు.


కామంతో కళ్లు మూసుకుపోయిన ఫేక్ బాబా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై పలుమార్లు అత్యాచారం చేశాడు. వీరిలో ఒకరికి పెండ్లి అయింది. ఆమెకు విడాకులు ఇప్పించి మరీ ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. వివాహితపై బాబా కుమారుడు కూడా అత్యాచారం చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా ఆర్థికంగా దోచుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాబాతో పాటు అతడి కుమారుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.