అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు.. మూడు ప్రధాన రైల్వే స్టేషన్లకు కూడా బెదిరింపు కాల్

Fake Bomb Call To Big B Amithab Bachan House
Fake Bomb Call To Big B Amithab Bachan House

బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు పెట్టామని.. దాంతో పాటు ముంబైలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లకు కూడా బాంబు ఫిక్స్ చేశామని వచ్చిన ఫోన్ కాల్ ముంబైలో కలకలం రేపింది. మరికొద్ది సేపట్లో అమితాబ్ ఇల్లు, ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో బాంబుల శబ్దం దద్ధరిల్లుతుందని ఓ ఆగంతకుడు ముంబై ప్రధాన కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు.

Fake Bomb Call To Big B Amithab Bachan House
Fake Bomb Call To Big B Amithab Bachan House

దుండగుడి ఫోన్ రాగానే వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో సోదాలు చేశారు. జుహులోని అమితాబ్ ఇంటి పరిసరాలతో పాటు, మూడు ప్రధాన రైల్వే స్టేషన్లలో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లు తనిఖీలు చేశారు. పోలీసుల సోదాల్లో ఎలాంటి పేలుడు సంబంధిత వస్తువులు దొరకలేదు. ఇది కేవలం ఫేక్ కాల్ అని.. పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తుండటంతో ముంబై పోలీసులు వాటిపై ఫోకస్ చేశారు. ఆగ‌స్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తుండటంతో నగరంలోని పలుచోట్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.