డైరెక్టర్ నంటూ నటికి నీచమైన మెసేజ్ లు. పోలీసులకు కంప్లైంట్.

ప్రముఖ డైరెక్టర్ నంటూ ఓ నటిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించి విఫలమవటంతో ఆమెకు నీచమైన మెసేజ్ లు పంపించటం స్టార్ట్ చేశాడు. ముందు అతను డైరెక్టరేనని భావించిన ఆ నటి ఇలా చెత్త మెసేజ్ లు రావటంతో అలర్ట్ అయ్యింది. తనకు వచ్చిన అన్ని మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేసింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ బెంగాల్ దర్శకుడు రవి కినాగి ఫోటోలు పెట్టి ఓ వ్యక్తి టీవీ నటి పాయల్ సర్కార్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఫ్రొఫైల్ రవి కినాగికి సంబంధించిన సినిమా వివరాలు కూడా ఉండటంతో అతను డైరెక్టరేనని నమ్మింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. వెంటనే చాటింగ్ లో దిగిన సదరు వ్యక్తి తను తీయబోయే తర్వాతి సినిమాలో ప్రధాన పాత్ర నీదేనంటూ ఆమె ఆశ చూపాడు. కానీ కొద్ది సేపటికి ఆమె నీచమైన మెసేజ్ లు పంపించటం స్టార్ట్ చేశాడు. దీంతో నటి పాయల్ సర్కార్ కు డౌట్ వచ్చింది. అతను పంపిన మెసేజ్ లు స్క్రీన్ షాట్ తో సహా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటంతో చాలా మంది అది ఫేక్ అకౌంట్ అని గుర్తించారు. వెంటనే పోలీసులకు కూడా నటి పాయల్ సర్కార్ కంప్లైంట్ చేసింది.

అరెస్ట్ చేయాల్సిందే

ఐతే తనకు గలీజ్ మెసేజ్ లు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు పాయల్. అటు డైరెక్టర్ రవి కినాగి కూడా తన పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అవకాశాల కావాలనుకునే వారు డైరెక్ట్ గా తన ఆఫీస్ కు రావాలని కోరారు. ఇలా సోషల్ మీడియా ద్వారా మోసవద్దని సూచించారు. బెంగాల్ లోని బరక్ పూర్ పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.