యాదాద్రిలో నకిలీ పోలీసులు అరెస్ట్

fake fake medical certificates gang arrest in hyderabad

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఇద్దరు నకిలీ పోలీసులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసిపి నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను మీడియాకి వెల్లడించారు. నిందితులు విజయ్, బడుగు సాయి తేజలను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామన్నారు. వారి వద్ద నుంచి 2 డమ్మీ గన్స్, 2 సెల్ ఫోన్స్, 2 ద్విచక్ర వాహనాలు, ఐడి కార్డులు, కంఫార్మషన్ లెటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

‘‘ఫిర్యాది దారు పసల జ్యోతి తన బంధువుల పై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫోర్జరీ కేసు నమోదైంది. కాగా
ఎఫ్ ఆర్ ఐ నుంచి పేర్లు తొలగిస్తామని, తాము పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నామని బాధితులను విజయ్, సాయి తేజ ఫోన్ లో సంప్రదించారు. 2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. బాధితురాలు జ్యోతి వారి బంధువులు లక్ష అడ్వాన్స్ గా ఇచ్చారు. కొన్ని రోజులకు నిందితులు మిగిలిన డబ్బుల కోసం బాధితులకు కాల్ చేశారు. ఎఫ్ ఐ ఆర్ లో పేర్లు తొలగించినట్లు డాక్యుమెంట్ చూపించాలని బాధితులు కోరారు.

భువనగిరి రైల్వే స్టేషన్ వద్దకు వచ్చి డాక్యుమెంట్ తీసుకొమ్మని నిందితులు చెప్పటం తో రైల్వే స్టేషన్ వద్ద కు బాధితురాలు రాగా.. నిందితులు విజయ్, సాయి తేజ లు డమ్మీ తుపాకులతో బాధితురాలిని బెదిరించి డబ్బులు వసూలు చేసి యాదగిరిగుట్ట కి పారిపోయారు. గుట్టలో సాయి తేజ ఇంట్లో తలదాచున్న ఇద్దరి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నిందితులిద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఐదుగురు వద్ద నుంచి నగదు వసూలు చేశారు.’’ అని డిసిపి నారాయణ రెడ్డి వెల్లడించారు.