ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శివ శంకర్‌ మాస్టర్‌ కన్నుమూత

shivashankar-master

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటుడు శివ శంకర్‌ మాస్టర్‌ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలి లోని ఏఐజీలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శివ శంకర్‌కు ఇద్దరు కొడుకులు. విజయ్‌ శివ శంకర్‌, అజయ్‌ శివ శంకర్‌ ఇద్దరూ డ్యాన్స్‌ మాస్టర్లే.

1948 డిసెంబ‌ర్ 7న త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో జ‌న్మించిన శివ‌శంక‌ర్ మాస్ట‌ర్.. తమిళ, తెలుగు చిత్రాలతో సహా 10 భాషల్లో 800లకు పైగా చిత్రాల్లో పాటలకు ఆయన కొరియోగ్రఫర్ గా పని చేశారు.

1975లో ‘పాట్టు భరతమమ్‌’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన.. ‘కురువికూడు’ సినిమాతో డ్యాన్స్ డైరెక్టర్ గా కెరీర్ మొదులు పెట్టారు.

కొరియోగ్రాఫర్‌గానే కాదు, నటుడిగానూ రాణించారు. 2003లో వచ్చిన ‘ఆలయ్‌’చిత్రంతో నటుడిగా మారిన శివ శంకర్‌ మాస్టర్‌.. దాదాపు 30కి పైగా సినిమాల్లో డిఫరెంట్ నటనతో నవ్వులు పంచారు.

వీటితోపాటు పలు డ్యాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహించారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన, ఎంతో మంది కొరియోగ్రాఫర్‌లు ప్రస్తుతం టాప్‌ డ్యాన్స్ డైరెక్టర్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.