ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వెరైటీగా కంగ్రాట్స్ చెప్పిన అభిమాని

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయిన కల్వకుంట్ల కవితకు ఆమె అభిమాని వినూత్నంగా శుభకాంక్షలు చెప్పాడు.

నిజామాబాద్ కి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సాయి ప్రసాద్ ఎమ్మెల్సీ కవితకు కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర పారా గ్లైడింగ్ ద్వారా భారీ ఫ్లెక్సీ ఎగురవేసి శుభాకాంక్షలు చెప్పాడు. 40 అడుగుల కవిత ఫొటోతో డిజైన్ చేసిన ఫ్లెక్సీని ఆకాశంలో ఎగురవేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా చూశారు.