రైతులు ఆధునిక వ్యవసాయం చేయాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం 2022 సాగు సన్నాహక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే లు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, రాములు నాయక్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉమ్మడి జిల్లాల కలెక్టర్ లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా వైవిధ్యమైన పంటలు, ఆధునిక వ్యవసాయం చేయటంలో, విభిన్న పంటలు పండిచటంలో ముందుంటారన్నారు. వ్యవసాయ రంగంపై తెలంగాణ ప్రభుత్వం 3 లక్షల 75 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయం చేయాలని మంత్రి సూచించారు. వానాకాలం సాగు అవగాహనలో భాగంగా దీర్ఘకాలిక వ్యవసాయ, మెళకువలు, వ్యవసాయ సదస్సు లు నిర్వహించబోతున్నామని తెలిపారు.

‘‘రాష్ట్రంలో కొంతమంది బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. అయ్య సంపాదించిన అక్రమ ఆస్తులతో రాజకీయం చేస్తున్న ఒక ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమెకు వ్యవసాయ ఏమి తెలుసు? రైతుల జీవితాలతో కొన్ని పార్టీలు, కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. రైతుబంధు, ఉచిత కరెంటు, రైతు బీమా, ఇస్తూ రైతులను అందుకుంటున్న మాకు నీతులు చెబుతారు. రైతు ఆత్మహత్యలకు 65 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీనే కారణం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణ ప్రాంతంలో ఇంత పంట ఎట్లా పండింది అంటున్నాడు. గతంలో పాలించిన పార్టీలకు చేతకానిది, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించింది.

తెలంగాణ ఇప్పుడు చేస్తాము అంటున్న వాళ్ళు…. ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏమి చేస్తున్నారో చెప్పాలి. ప్రభుత్వం చేస్తున్న పనులు రైతులకు…  రైతు సమన్వయ సమితి సభ్యులు తెలియజేయలి. పెట్టుబడి ఖర్చులు తగ్గిచే మార్గాలు చూడాలి. రిస్క్ లేని వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలి. భూసారం పెంచుకొనే విధానాన్ని తెలియజేయాలి. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు తెలియజేయటానికి ఈ సదస్సులు నిర్వహిస్తున్నాం.’’ అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.