ఆమె పిత్తితే కూడా లక్షలు రాలుతాయి.. నెలకు ఎంత సంపాదిస్తుందంటే - TNews Telugu

ఆమె పిత్తితే కూడా లక్షలు రాలుతాయి.. నెలకు ఎంత సంపాదిస్తుందంటేపక్కన ఉన్నవారు పిత్తితే ముక్కు మూసుకొని అంత దూరం వెళ్లిపోతాం. అది అందరూ చేసే పనే అయినా.. పక్కవారు పిత్తితే మాత్రం అదేదో క్షమించరాని తప్పు చేసినట్టుగా చూస్తారు. పాపం.. చాలామంది పక్కవారు ఏమనుకుంటారో అన్న భయానికి దాన్ని లోలోపలే దాచుకుంటారు. కొంతమంది ఎవరినీ పట్టించుకోకుండా బాహటంగానే పిత్తేస్తుంటారు. అయితే ఇప్పుడు పిత్తు గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందని ఆలోచిస్తున్నారా? దానికి కూడా ఓ కారణం ఉంది. పిత్తి కూడా డబ్బులు సంపాదించొచ్చని నిరూపించింది ఓ మహిళ. తన పిత్తులు అమ్ముకొని ఇప్పటి వరకు రూ.18.15 లక్షలు సంపాదించింది. ఆమె పేరే.. లష్ బొటానిస్ట్. ఆమె పిత్తితే చాలు.. డబ్బులు రాలుతాయి. ఇంటర్నెట్ లో ఆమెను అంతా fart queen of the internet అంటారు.

fart queen of the internet earned 25,000 dollers
fart queen of the internet earned 25,000 dollers

నేను ఈ బిజినెస్‌ను గ‌త మూడేళ్లుగా చేస్తున్నాను. నాకు రోజుకు చాలా డీల్స్ వ‌స్తుంటాయి. నేను పిత్తితే క్ల‌యింట్స్ నాకు ఫోన్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె చేయాల్సిన పనేంటో తెలుసా? జస్ట్.. కెమెరా ముందు పిత్త‌డ‌మే. అసలు ఈదంతా ఎలా స్టార్టయిందంటే.. ఒక‌సారి.. కెమెరా ముందు పిత్తాలంటూ ఒక‌రు ఆన్‌లైన్‌లో లష్ ని అడిగారట. ఆమె సిగ్గు పడుతూనే కెమెరా ముందు పిత్తింది. ఆ వీడియో కాస్త మస్తు పాపుల‌ర్ అయింది. అంతే.. అప్పటి నుంచి అడిగ మరీ పిత్తించుకుంటున్నారట. మీకో విషయం తెలుసా.. పిత్తులు బాగా వచ్చేందుకు.. సౌండ్ బాగా వచ్చేందుకు ఆమె ఆహారంలో చాలా మార్పులు చేసుకుంది లష్. మంచి ఫుడ్ తింటేనే కదా.. మంచి పిత్తులు వస్తాయి అంటోంది లష్.
ఏదైనా మిల్క్ ప్రొడక్ట్ తీసుకుంటే.. త‌న‌కు పిత్తులు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ట‌. ఇంతకీ లష్ ఒక్క పిత్తుకు ఎంత చెల్లిస్తారో తెలుసా.. ? అక్షరాలా 175 డాలర్లు. ఒకరోజైతే.. ఏకంగా 4000 డాలర్లు సంపాదించిందట ఈ ఫర్ట్ క్వీన్. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం పిత్తుల ద్వారా 25వేల డాల‌ర్ల‌ు అంటే మన కరెన్సీలో 18.5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సంపాదించింది ల‌ష్. త‌ను పిత్తే పిత్తు.. బెస్ట్ గా, మంచి సౌండ్‌తో విన‌ప‌డ‌టం కోసం మంచి కెమెరాతో పాటు.. సౌండ్ క్వాలిటీ కోసం మైక్రోఫోన్‌ను కూడా వాడుతుందట లష్. ఒక క‌స్ట‌మ‌ర్ అయితే.. త‌న బొమ్మ మీద పిత్తాలంటూ రిక్వెస్ట్ పంపించాడ‌ట‌. ర‌క‌ర‌కాల క‌స్ట‌మ‌ర్లు త‌న‌కు త‌గులుతున్నార‌ని చెప్తోంది. ఎవరేమనుకున్నా.. పిత్తుల వల్ల రెండు చేతులా సంపాదిస్తున్నా అంటూ గర్వంగా చెప్పుకుంటోంది లష్.