ముంబైలోని ధార‌విలో ఘోరం.. గ్యాస్ సిలిండ‌ర్ పేలి 15 మందికి గాయాలు

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని ధార‌విలోని సాహూ న‌గ‌ర్ ఏరియాలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండ‌ర్ పేలింది. ఈ ప్ర‌మాదంలో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతానికి చేరుకొని మంట‌ల‌ను ఆర్పేసి క్ష‌త‌గాత్రుల‌ను సియాన్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గ్యాస్ లీకేజీనే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలిందని పోలీసులు చెప్పారు.

తొలుత గ్యాస్ లీకై సిలిండ‌ర్‌కు మంట‌లు అంటుకున్నాయని.. ఆ త‌ర్వాత సిలిండ‌ర్ పేలిపోవ‌డంతో పెద్దఎత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయ‌ని పోలీసులు వివరించారు.