మంత్రి తలసాని చొరవ.. సినీ కార్మికుల చర్చలు సఫలం

minister talasani srinivas yadav

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో సినీ కార్మికుల వేతనాల పెంపు చర్చలు సఫలం అయ్యాయి. కార్మికులకు వేతనాల పెంపు ఫైనలైజేషన్ కు దిల్ రాజ్ నేతృత్వంలో కో ఆర్డినేషన్ కమిటీ తదుపరి చర్చలు జరుపనుంది.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ఫెడరేషన్ సభ్యులతో మీటింగ్ నిర్వహించాము. రెపటినుండి యధావిధిగా షూటింగ్లు జరుగుతాయి. కో ఆర్డినెషన్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత పెరిగిన వేతనాలు కార్మికులకు ఫెడరేషన్, ఛాంబర్ ద్వారా వెళతాయి. ఫైనలైజేషన్ చేసిన వేతనాలు కార్మికులకు చెల్లిస్తాం. దిల్ రాజ్ చైర్మన్ గా రేపు 11 గంటలకు కో ఆర్డినెషన్ కమిటీ సమావేశం అవుతుందన్నారు.

ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ.. వేతనాలు పెంచడం మాకు సంతోషం. విధివిధానాలు కోసం కమిటీ వేశారు. రేపటినుండి విధుల్లో పాల్గొంటాము. మా డిమాండ్లు అన్నింటిని అంగీకరించారు. కో ఆర్డినేషన్ కమిటీ ద్వారా మా సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు.