కంగనా అరెస్ట్..?

FIR against Bollywood Heroine Kangana Ranaut in Mumbai for ‘derogatory’ remarks against Sikhs
FIR against Bollywood Heroine Kangana Ranaut in Mumbai for ‘derogatory’ remarks against Sikhs

కంగనా రనౌత్ పిచ్చి పీక్స్ చేరిందని యావత్ భారతీయులందరు సోషల్ మీడియాలో గళమెత్తుతుంటే.. ప్రతిసారి ఇదే విషయాన్ని నిజాయితీగా ప్రూవ్ చేసుకుంటూనే ఉంటుంది హీరోయిన్ కంగనా రనౌత్. సోషల్ మీడియాలో ఈమెకు బాలీవుడ్ బ్యాడ్ గర్ల్ అంటూ కూడా తెగ ట్రోల్ చేస్తుంటారు. అన్నివర్గాల వారిని రెచ్చగొట్టడమే ప్రధాన ఎజెండాగా ఈమె అరాచకాలు సాగుతుంటాయి. కానీ కొందరు ఢిల్లీ పెద్దల అండతో రోజురోజుకి ఈమె మరింత రెచ్చిపోతుందంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా భారతదేశంలో బలమైన సిక్కు వర్గానికి చెందిన ప్రజలని దారుణంగా అవమానించింది కంగనా రనౌత్. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు మొదటినుంచి మద్దతు తెలుపుతున్న కంగనా రనౌత్.. తప్పు తెలుసుకుని ఆ చట్టాలని మోడీ రద్దు చేయటంతో రెచ్చిపోయి వ్యాఖ్యానించింది. గురునానక్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన చేయటంతో.. సిక్కులపై తీవ్రవ్యాఖ్యలు చేస్తూ ఇన్‌స్టాలో పోస్టు చేసింది. సిక్కు సమాజం మొత్తాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులుగా అభివర్ణించడంతోపాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వారిని చితకబాదారని.. బూట్ల కింద దోమల్లా నలిపివేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇలాంటి వారందరికీ.. అలాంటి గురువు కావాలంటూ ఆమె రాశారు. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ.. సిక్కుల ఫిర్యాదు మేరకు కంగనా రనౌత్‌పై ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక మొదటినుంచి ప్రధాని మోదీకి మద్దతునిస్తూ వస్తున్న కంగనా రనౌత్ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటు, అన్యాయమని.. పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధిలో ఉన్న ప్రజలు చట్టాలు చేస్తారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అయితే సిక్కులపై కంగనా జాత్యంకార వ్యాఖ్యలు చేసినట్టుగా పరిగణించి వెంటనే అరెస్ట్ చేసి.. సిక్కుల మనోభావాలు కాపాడాలని.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. చూద్దాం మరి కంగనా విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.