కర్మాన్‌ఘాట్‌ కెనరా బ్యాంకులో అగ్నిప్రమాదం

fire accident at Canara Bank Karmanghat on tuesday

 fire accident at Canara Bank Karmanghat on tuesday

హైదరాబాద్‌ లోని కర్మాన్‌ఘాట్‌ బాలాగౌడ్ కాంప్లెక్స్‌లోని కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది.  షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంగళవారం ఉదయం బ్యాంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బ్యాంకు నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే షెట్టర్ త్వరగా తెరుచుకోకపోవడంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్ రంగంలోకి దిగి తాళాలు పగులగొట్టింది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.