టెక్స్ టైల్స్ కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం

fire

fire accident in a textile company .. Property damage in crores of rupees

గుంటూరు జిల్లాలోని ఓ టెక్స్ టైల్స్ కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వంకాయలపాడులోని ఎన్ఎస్ఎల్ టెక్స్‌ టైల్స్‌కు సంబంధించిన స్పిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి.. క్షణాల్లో భవనాలన్నింటికి వ్యాపించాయి. కంపెనీలో తయారైన వస్త్రాలను గోదాములో నిల్వ ఉంచారు. అక్కడే అగ్ని ప్రమాదం జరిగి సరకు మొత్తం దగ్ధమైంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. స్పిన్నింగ్ మిల్లులో భారీగా పత్తి నిల్వలు వున్నట్లు యాజమాన్యం చెబుతోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వుంటాయని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. నష్టం విలువ రూ.కోట్లలో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు