ఫిలిం నగర్ సినిమా షూటింగ్ లో అగ్నిప్రమాదం.. దగ్ధమైన కారు

Fire Accident In film Nagar car Completely Trashed
Fire Accident In film Nagar car Completely Trashed
Fire Accident In film Nagar car Completely Trashed
Fire Accident In film Nagar car Completely Trashed

హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారు జామునే జరిగిన ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఫిలిం నగర్ లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ లో జనరేటర్ వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో అందులోంచి డీజిల్ లీక్ కావడంతో ఉన్నట్టుండి మంటలు పెరిగాయి. రోడ్డు పక్కనే ఉన్న కారు, దుకాణాలకు మంటలు వ్యాపించాయి. మంటల ఉధృతి పెరగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. దుకాణాల్లోని పలు వస్తువులు కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.