గాంధీ దవాఖానలో అగ్నిప్రమాదం.. మంత్రి తలసాని ఆరా

fire accident in Gandhi hospital, hyderabad

 fire accident in Gandhi hospital, hyderabad

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ బోర్డ్​లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పొగలు అలుముకోవడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఆందోళన చెందారు. ఈ ఘటనతో ఆస్పత్రిలోని 5 వ అంతస్తు వరకు పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి సిబ్బంది… అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్టలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది… మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు పరిశీలించి… రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కాగా గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు, పాడి, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తో సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఘటనకు జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాను హుజురాబాద్ ఎలక్షన్ క్యాంపింగ్ లో ఉన్నానని ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి పేదల వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడు వైద్య సేవలకు పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఆయన ఆదేశించారు. తాను హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తారని ఫోన్ లో మాట్లాడారు.

గాంధీ ఆసుపత్రిలో ఎలక్ట్రికల్ బోర్డ్​లో కేబుల్స్ దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారి నాగేంద్ర తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశామని, రోగులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు.