కోల్ కత్తాలో భారీ అగ్నిప్రమాదం.. 9మంది మృతి

కోల్ కత్తాలో భారీ అగ్నిప్రమాదం.. 9మంది మృతి
కోల్ కత్తాలో భారీ అగ్నిప్రమాదం.. 9మంది మృతి


పశ్చిమ బెంగాల్ కోల్‌ కతాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మృతులలో ఇద్దరు ఆర్ఫీఎఫ్ జవాన్లు, ఒక ఎస్ఐ, నలుగురు అగ్నిమాపకదళ సిబ్బంది ఉన్నారు. బాధితులంతా పొగతో లిఫ్ట్‌ లో ఊపిరాడక చనిపోయారని అధికారులు తేల్చారు. ఘటనా గురించి సమాచారం అందగానే సీఎం మమతా బెనర్జీ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదస్థలంలో పరిస్థితులను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. రైల్వే బిల్డింగ్‌ లో ప్రమాదం జరిగినా రైల్వేశాఖ నుంచి ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదని ఆరోపించిన దీదీ.. దీనిపై రాజకీయాలు చేయాలనుకోవడం లేదన్నారు.