వ‌న‌స్థ‌లిపురంలో అగ్నిప్ర‌మాదం.. మ‌హిళ‌ స‌జీవ‌ద‌హ‌నం

Fire accident in Vanasthalipuram FCI Colony, woman burnt alive

Fire accident in Vanasthalipuram FCI Colony, woman burnt alive

హైద‌రాబాద్ న‌గ‌రంలోని వ‌న‌స్థ‌లిపురం ఎఫ్‌సీఐ కాల‌నీలో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఇంట్లో మంట‌లు చెల‌రేగి భార్య స‌జీవ‌ద‌హ‌నం కాగా, భ‌ర్త‌కు తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. గాయాల‌పాలైన వ్య‌క్తిని చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతురాలిని ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలు స‌ర‌స్వ‌తి(45)గా పోలీసులు గుర్తించారు. స‌ర‌స్వ‌తి నివాసం ఉంటున్న రెండో అంత‌స్తులో మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.