బిగ్ బ్రేకింగ్: హీరోయిన్ రకుల్ ఇంట్లో అగ్ని ప్రమాదం..!

Fire Breaks Out At Heroine Rakul Preet Singh House in Mumbai
Fire Breaks Out At Heroine Rakul Preet Singh House in Mumbai

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలో ఆమె నివాసముంటున్న బిల్డింగ్ 12 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో రకుల్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా మంటలు రాజుకోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకూ తెలియరాలేదు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్.. నటుడు నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు సీక్రెట్ గా లవ్ లో ఉన్న ఈ భామ తన ప్రేమ విషయాన్ని బర్త్ డే రోజున అధికారికంగా ప్రకటించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. జాకీ ఈ ఏడాది తనకు దక్కిన పెద్ద బహుమతిగా పేర్కొంది.