తిరుమ‌ల‌లో అగ్ని ప్ర‌మాదం.. ప‌లు దుకాణాలు ద‌గ్ధం

fire broke out in Tirumala , shops burnt down

fire broke out in Tirumala , shops burnt down

తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి ఆస్థాన మండపం సమీపంలో ఉన్న దుకాణాల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఆరు దుకాణాలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. షాపులు దగ్ధం కావడంతో భారీమొత్తంలో దుకాణంలోని వస్తువులు కాలిపోయాయి.