కూర‌గాయ‌ల మార్కెట్‌లో అగ్నిప్రమాదం

మ‌హారాష్ట్ర పుణెలోని శివాజీ కూర‌గాయ‌ల మార్కెట్‌లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 25 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

పుణె మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ప్ర‌శాంత్ రాన్‌పైసే వెల్లడించిన వివరాల ప్రకారం.. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఓ షాపులో ప్రారంభమైన మంటలు, క్షణాల్లో ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.  ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, ఈ ప్రమాదంలో నష్టపోయిన కూరగాయల షాపులన యజమానులను ఆదుకుంటామని అక్కడి అధికారులు భరోసా ఇచ్చారు.