ఫిట్ నెస్ తగ్గుతుందనిపిస్తుందా.. ఓ సారి చెక్ చేసుకోండి

చాలామంది వర్క్ బిజీలోనో.. వేరే టెన్షన్ లో ఉండి బాడీలో జరుగుతున్న మార్పులను గమనించలేరు. బరువు పెరుగుతున్నారా? తగ్గుతున్నారా? ఫిట్ నెస్ ఉందా? పోయిందా? అనే విషయాన్నే పట్టించుకోవడం లేదు. దీంతో జాగ్రత్తలు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలా కాకుండా మీ ఫిట్ నెస్ ఎంతుంది? మీరు బరువు పెరిగారా.. ఈ లక్షణాలు మీలో ఉన్నాయేమో ఓసారి చూసుకోండి.


వయసును బట్టి మనిషి శరీరంలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకు చాలా కారణాలుంటాయి. పని ఒత్తిడి, సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు, సరిపడా నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల బాడీలో మార్పులు జరుగుతుంటాయి. దీనికి తోడు కరోనా వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలు వచ్చాయి. కరోనా వల్ల ఆర్థికంగా, ఆరోగ్య పరంగా చాలామంది నష్టపోయారు. ఫిట్ గా ఉన్నారా? లేదా అనే విషయంలో చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అయితే.. మీరు ఫిట్ నెస్ గా ఉన్నారో లేదో తెలియాలంటే ఈ మార్పులు గమనించండి.

చిన్న చిన్న పనులకే శ్వాస తీసుకోవడం
చిన్న చిన్న పనులు చేసినందుకే ఎక్కువ శ్వాస తీసుకుంటున్నారా? దమ్ము తీస్తున్నారా? మెట్లు ఎక్కినప్పుడు.. ఏదైనా చిన్న బరువు మోసినప్పుడు ఎక్కువగా శ్వాస తీసుకుంటే మీ ఫిట్ నెస్ లో తేడా వచ్చిందని అర్థం.


గుండె కొట్టుకునే వేగం
కాస్త ప్రశాంతంగా ఉన్న సమయంలో గుండె కొట్టుకునే వేగం ఒకసారి గమనించండి. హృదయ స్పందన మామూలుగా ఉంటే ఓకే. లేదు.. సడెన్ గా పెరిగినట్టు అనిపిస్తే మీ శరీరంలో చాలా మార్పులు జరుగుతున్నాయని అర్థం. గుండె వేగం శబ్దానని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే స్మార్ట్ వాచ్ వాడి చూడండి. హార్ట్ బీట్ కి తగ్గట్టు వర్కవుట్లు చేయండి.

తరచూ ఒళ్లు నొప్పులు రావడం
బాడీలో ఫిట్ నెస్ లేకపోతే నిత్యం బాడీ పెయిన్స్ వస్తుంటాయి. ఈ నొప్పుల నుంచి బయట పడాలంటే క్రమం తప్పకుండా వర్కవుట్లు చేయడం మరిచిపోవద్దు. ప్రతిరోజూ నొప్పులు వస్తున్నాయంటే బరువు పెరిగిందని గమనించాలి. అప్పుడు ఫుడ్ మీద, వర్కవుట్ల మీద ధ్యాస పెట్టాలి.


నిద్రలేమి
బాడీకి సరిపడా పని లేకపోతే నిద్ర సరిగ్గా రాదు. బాడీ వెయిట్ పెరిగిందని చెప్పడానికి ఇది కూడా ఒక మార్గం. నిద్రలేమి అనేది చాలా ప్రమాదం. ఎందుకంటే రాత్రి నిద్రలేకపోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నిద్రలేమి సమస్యను అధిగమించాలంటే రెగ్యులర్ గా వర్కవుట్లు చేయాలి.
ఈ లక్షణాలు తరచూ మీ శరీరంలో గమనిస్తే.. మీ బాడీలో చాలా మార్పులు వచ్చినట్టు అర్థం. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే వ్యాయామం, శారీరక శ్రమ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. బరువు పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. వీలైనంత నిద్ర పోతే.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.