లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి.. 40 మందికి గాయాలు

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 40 మంది గాయపడ్డారు. బస్సు ఇండోర్‌ నుంచి ఖాండ్వా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. సిమ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భైరవ్ ఘాట్‌పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు 50 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది.

ప్రమాద సమయంలో 50 మందికిపైగా ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో నుంచి గాయపడ్డ వారిని రక్షించి, ఆసుపత్రికి తరలించారు.