బిహార్‌లో కల్తీ మద్యం తాగి ఐదుగురి మృతి

Five killed in Bihar over counterfeit liquor

బిహార్‌ నలందా జిల్లాలో కల్తీ మద్యం తాగి ఐదుగురి మృతి చెందడం కలకలం రేపింది. మన్పూర్‌లో ముగ్గురు, చోటీపహారీలో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. విషపూరిత రసాయనం తాగి వారంతా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.