పడవలో అగ్నిప్రమాదం జరగడంతో బోట్లో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలు మృతి చెందిన ఘటన పట్నాలోని రాంపూర్ దియర ఘాట్లో జరిగింది. డీజిల్ క్యాన్లు ఉంచిన ప్రదేశంలో కూలీలు వంట చేసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బీహార్ పోలీసులు తెలిపారు.
సిలిండర్లు పేలడంతో అగ్నిప్రమాదం జరిగిందని చెబుతున్నా.. అది వాస్తవం కాదని, డీజిల్ క్యాన్ల దగ్గరే వంట చేయడం వల్లే ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పడవలో అక్రమ ఇసుకను తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన పడవలో 20 మంది కూలీలు ఉన్నారని, సైట్లో ఇసుక అన్లోడింగ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.