దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఐదుకు చేరాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవలే ఆ వ్యక్తి టాంజానియా నుంచి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన బాధితుడిని ఎల్ఏఎన్జేపీ దవాఖానాలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి భారత్ కి వచ్చిన వారిలో 17 మందిలో కొవిడ్ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. అందరినీ ఎల్ఎన్జేపీ దవాఖానాలోని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు.