తమిళనాడులోని శంకరాపురం బాణాసంచా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకొని ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మరో పదిమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలకు దిగారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఆర్పిన తర్వాత మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు