ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఎన్నికల సంఘం కీలక సమావేశం

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా రాష్ట్రాల ఎన్నికల అధికారులతో ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర నేతృత్వంలో భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చ చేస్తున్నట్లు సమాచారం.