కోట్లకు పడగలెత్తిన ఈ అపర కుబేరులు ఏం చదివారో తెలుసా?

forbs listed richmans education qualification
forbs listed richmans education qualification
forbs listed richmans education qualification
forbs listed richmans education qualification

కోట్ల రూపాయలు సంపాదించి.. రాజభోగాలు అనుభవించే వారి పేరు చెప్పమంటే టకటకా ఓ పది మంది పేర్లు చెప్పేస్తారు ఎవరైనా. వారి పేరు చెప్పగానే వారికి ఎన్ని ఆస్తిపాస్తులున్నాయో చెప్తారు. కానీ.. వారు ఏం చదువుకున్నారో మాత్రం చాలామందికి తెలియదు. ప్రపంచమంతా చెప్పుకునే ఎంతోమంది శ్రీమంతులు పెద్ద పెద్ద చదువులు లేకుండానే కోట్లకు పడగలెత్తారు. ఫోర్బ్స్ జాబితలో అత్యంత ధనవంతులుగా చోటు సంపాదించిన.. బాగా ఫేమస్ అయిన కొంతమంది శ్రీమంతుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూసేద్దామా!

bejos
bejos

జెఫ్‌ బెజోస్‌
ఫోర్బ్స్ అత్యంత ధనవంతుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న జెఫ్ బెజోస్ తెలుసు కదా! అమెజాన్ ఓనర్. 1994లో బెజోస్ అమెజాన్ ను స్థాపించారు. ఆయనకు 16 ఏండ్ల వయసున్నప్పుడు మెక్ డోనాల్డ్స్ లో ఫ్రై కుక్ గా పనిచేశాడు. చదువుకుంటూనే.. పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడు. అలా గంటకు 2.69 డాలర్లు చదువుకునే రోజుల్లోనే సంపాదించేవాడు బెజోస్. ఇంతకీ బెజోస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా..? ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ లో బ్యాచ్ లర్ డిగ్రీ చదివి పట్టా అందుకున్నాడు ఈ అమేజాన్ ఓనర్.

elon-musk
elon-musk

ఎలాన్‌ మస్క్‌
పన్నెండేండ్ల వయసులోనే స్పేస్ థీమ్ తో వీడియో గేమ్ కి కోడింగ్ చేసి.. 500 డాలర్ల పారితోషికం గెలుచుకున్న ఎలన్ మస్క్ ఆ తర్వాత టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థలకు అధినేతగా ఎదిగాడు. బ్లాస్టర్ అనే స్పేస్ థీమ్డ్ వీడియో గేమ్ కి కోడింగ్ చేసి పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే మ్యాగజైన్ కి పంపి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. 184.5 బిలియన్ డాలర్లకు అధిపతి అయిన ఎలన్ మస్క్.. చదివింది బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే. ఫిజిక్స్, ఎకనామిక్స్ లో ఆయన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ కోసం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చేరాడు. కానీ.. కేవలం రెండు రోజుల్లోనే కాలేజీకి వెళ్లడం మానేశాడు.

Bernard Arnault
Bernard Arnault

బెర్నార్డ్‌ అర్నాల్ట్‌
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులు, బ్రాండ్ అంటే.. ఎల్వీఎంహెచ్. దీని అధిపతి బెర్నార్డ్ అర్నాల్డ్. ప్రస్తుతం ఈ శ్రీమంతుడి సంపద 179.3 బిలియన్ డాలర్లు. అర్నాల్డ్ చదివింది కేవలం డిగ్రీ మాత్రమే. ఇంజినీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన తండ్రి నడిపిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ఎల్వీఎంహెచ్ లో పెట్టుబడి పెట్టి.. కొంతకాలం తర్వాత ఆ కంపెనీనే సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోని కాస్ట్లీ బ్రాండ్ లన్నీ ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి.

bill gates
bill gates

బిల్‌ గేట్స్‌
ప్రపంచంలో ఈ పేరు పరిచయం లేని వారు చాలా తక్కువమంది ఉంటారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్ష్ 1975లో పాల్ అలెన్ తో కలిసి మైక్రోసాఫ్ట్ స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఆయన ఆస్తుల విలువ 131.6 బిలియన్ డాలర్లు. అయితే.. గేట్ష్ తొలుత హార్వర్డ్ యూనివర్సిటీలో లా కోర్సులో చేరారు. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ మీద ఇష్టంతో సొంతంగా ఆ కోర్సులను పూర్తి చేశారు. దీంతో లా చేద్దామనుకున్న ఆయన ఆలోచన అలా వాయిదా పడిపోయింది. టెక్నాలజీ మీద ఉన్న ఆసక్తితో మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టి ఎంత సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Mark-Zuckerberg
Mark-Zuckerberg

మార్క్‌ జుకర్‌బర్గ్‌
ఈరోజు ప్రతి ఒక్కరికి పరిచయమున్న వ్యక్తి మార్క్ జూకర్ బర్గ్. ఫేస్ బుక్ తో కోట్లాది మందితో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్నే నెలకొల్పిన జూకర్ బర్గ్ కి ఇంటర్నెట్, టెక్నాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదట. హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ, కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ కోసం చేరాడు. ఓ వైపు డిగ్రీ చేస్తూనే.. ఫేస్ బుక్ కి ప్రోగ్రాం రాశాడు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రెండో సంవత్సరంలోనే డిగ్రీకి గుడ్ బై చెప్పేశాడు. జూకర్ కి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద ఉన్న ఆసక్తిని, పట్టుని గమనించిన ఆయ తండ్రి ఓ ప్రైవేట్ ట్యూటర్ ని పెట్టి ట్రైనింగ్ ఇప్పించారు. కాలేజికి వెళ్లకముందే ఎన్నో ప్రోగ్రామ్స్ రాసిన జూకర్.. ట్రైనింగ్ పూర్తయ్యాక ఫేస్ బుక్ స్థాపించి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి ఆజ్యం పోశాడు. ప్రస్తుతం జూకర్ బర్గ్ సంపద 130.7 బిలియన్ డాలర్లు.

buffett
buffett

వారెన్‌ బఫెట్‌
ఇన్వెస్ట్ మెంట్ పెట్టాలంటే వారెన్ బఫెట్ తర్వాతే ఎవరైనా అనే రేంజ్ కి ఎదిగిన బఫెట్.. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఎకనామిక్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న సమయంలోనే ప్రముఖ మదుపర్లు బెంజిమెన్ గ్రాహమ్, డేవిడ్ డాడ్ తో పరిచయమైంది. వారి పరిచయంతో పెట్టుబడుల మీద పట్టు సాధించాడు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడంలో ప్రపంచంలోనే టాప్ మోస్ట్ పర్సన్ గా నిలిచాడు.

mukesh-ambani
mukesh-ambani

ముఖేశ్‌ అంబానీ
దేశంలోనే అపర కుబేరుడు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆస్తుల గురించి తెలియని వారుండరు. ప్రపంచ ధనవంతుల జాబితాలో ముఖేష్ 12వ స్థానంలో ఉన్నారు. బాంబే యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అంబానీ.. ఆ తర్వాత స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏలో చేరాడు. అదే సమయంలో రిలయన్స్ కొత్త రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించింది. దీంతో.. ఎంబీఏ మధ్యలోనే ఆపేసి.. వ్యాపార బాధ్యతలు భుజానికెత్తుకున్నాడు. రిలయన్స్ ను లాభాల బాటలో నడిపించి ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం అంబానీ ఆస్తుల విలువ 82.7 బిలియన్ డాలర్లు.

Gautam_Adani

గౌతమ్‌ అదానీ
అదానీ గ్రూప్ ని ప్రారంభించి.. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా, ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు సంపాదించిన గౌతమ్ అదానీ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అప్పటికే తండ్రి టెక్స్ టైల్స్ కంపెనీతో లాభాల్లో ఉన్నా.. గౌతమ్ అదానీ సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. తనకు కూడా ఓ గుర్తింపు రావాలని.. కలలు కన్నాడు. ఆ కలలు నిజం చేసుకునేందుకు గుజరాత్ వదిలి.. ముంబై వచ్చాడు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ.. కోట్ల రూపాయలు సంపాదించి సక్సెస్ స్టోరీకి ఉదాహరణగా నిలిచాడు. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 21వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ అదానీ ఆస్తుల విలువ 57.5 బిలియన్ డాలర్లు.