ప్రధాని మోడీ రాక ముందు ఈటలకు ఝలక్ !

four bjp corporators joinTRS big shock to etela rajendra
four bjp corporators joinTRS big shock to etela rajendra

జూన్ 2న హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి రెండు రోజుల ముందు, ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి బిగ్ షాక్ తగిలింది. తాండూరు మున్సిపాలిటీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌తో పాటు జీహెచ్‌ఎంసీలోని నలుగురు బీజేపీ కార్పొరేటర్లు గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటికే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న అంటూ ప్రగల్బాలు పలుకుతున్న ఈటల రాజేందర్ లాంటి సీనియర్లకు ఈ వార్త ఓ విధంగా ఝలక్ అనే చెప్పాలి.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్ లో చేరారు. జీహెచ్‌ఎంసీకి చెందిన నలుగురు బీజేపీ కార్పొరేటర్లు బాణోత్ సుజాత నాయక్ (హస్తినాపురం), పి అర్చన ప్రకాష్ (రాజేంద్రనగర్), డి వెంకటేష్ (జూబ్లీహిల్స్), సునీత ప్రకాష్ గౌడ్ (అడిక్‌మెట్)తో పాటు తాండూరు మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ సింధూజా గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ లు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు మోడీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ రానుండగా సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరడం ఆసక్తికర పరిణామం.

four bjp corporators join TRS
four bjp corporators join TRS