దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న నాలుగు ముఠాలు అరెస్ట్

Four-mobile-thefts-gangs-arrest

దృష్టి మళ్లించి మొబైల్ చోరీలకు పాల్పడుతున్న నాలుగు గ్రూపుల ముఠాను హైదరాబాద్ ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ చెప్పారు.

నాలుగు ముఠాల్లోని 9 మంది సభ్యులతో పాటు రెండు ఆటోలు, రూ.12 లక్షల విలువచేసే 92 మొబైల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంచన్ బాగ్, డబిర్ పురా, చంద్రాయణగుట్ట, కాలపత్తార్, రాయదుర్గం, మైలార్ దేవ్ పల్లి, మాదాపూర్, మిర్ చౌక్, సనత్ నగర్, అప్జల్ గంజ్ తదితర పోలీసుస్టేషన్ లలో ఈ ముఠా సభ్యులపై కేసులు నమోదు అయ్యాయని సీపీ వివరించారు.

ఈ ముఠా సభ్యులు అనేక నేరాల్లో నిందితులుగా ఉన్నారని, ఇప్పటివరకు 141 మంది క్రిమినల్స్ పై పీడీయాక్ట్ కేసులు నమోదు చేశామన్నారు. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో సీఎం సమీక్ష తరువాత ఓన్లీ డ్రక్స్ కేసులలో 9 మందిపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేశామని, 8 మంది రౌడీషీటర్లపై పీడీయాక్ట్ నమోదు చేశామన్నారు.

నాలుగు ముఠాలకు చెందిన నిందితులు

(1) మొహమ్మద్ మహమూద్ అలీ, మొహమ్మద్ ఖాన్,అమీర్ ఖాన్.

(2) మొహమ్మద్ మోహసీన్, హమ్మద్ మూసా.

(3) మొహమ్మద్ అబ్దులహజీ, మొహమ్మద్ రాఫీక్.

(4) మొహమ్మద్ మన్సూర్, మొహమ్మద్ దస్తగిరి.