బ్రేకింగ్ న్యూస్.. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి - TNews Telugu

బ్రేకింగ్ న్యూస్.. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి 

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్మడి పుల్కల్ మండలం చౌటకుర్ వద్ద లారీ కారును ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు కొల్చారం మండలం రంగముపేట గ్రామానికి చెందిన వారుగా స్థానికులు పోలీసులు గుర్తించారు.

వీరంతా సంగారెడ్డిలో ఓ ప్రవైట్ ఆసుపత్రికి వెళ్లి తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరూ మహిళలు ఇద్దరూ పురుషులతో పాటు ఒక బాలుడు మృతిచెందాడు. లారీ అతివేగంగా రావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చెప్పారు. వీరంత ఒకే కుటుంబానికి సంభందించిన వారు కావడంతో వారి సొంత గ్రామంలో విషాదం నెలకొంది.  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతులంతా.. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామనికి చెందిన హోసన్న గోని దీవెన (41), నారాయణ  (44), బుర్ర అంబదాస్ (33), పద్మ(30),  బుర్ర వివేక్(6)గా గుర్తించారు. కొడుకు కు ఆరోగ్యం బాగలేక పోవడంతో.. పద్మ, దాస్ తమ కొడుకుతో స్వస్థలం మెదక్ జిల్లా రంగముపేట నుంచి సంగారెడ్డి హాస్పిటల్ వచ్చారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదం చోటు చేసుకుంది.