ల‌ఖింపూర్ ఖేరీ కేసులో మ‌రో న‌లుగురు అరెస్ట్

Lakhimpur Kheri violence: Two arrested, Union Minister Ajay Mishra’s son summoned by police

ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరీ కేసులో మరో నలుగురిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమిత్ జైస్వాల్(బీజేపీ నాయ‌కుడు), శిశుపాల్, నంద‌న్ సింగ్ బిస్త్, స‌త్య ప్ర‌కాశ్ త్రిపాఠిని అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. స‌త్య‌ప్ర‌కాశ్ త్రిపాఠి నుంచి లైసెన్స్ డ్ రివాల్వ‌ర్, మూడు బుల్లెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అక్టోబ‌ర్ 9న కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

ఈ నెల 3న లఖింపూర్‌ ఖేరీలో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు పక్కన నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్‌ మిశ్రా వాహనం కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతలు మరణించగా.. తర్వాత జరిగిన అల్లర్లలో ఒక జర్నలిస్ట్‌, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారు.