ఈతకు వెళ్లిన అయిదుగురు స్టూడెంట్స్ గల్లంతు

students went swimming were abducted

రాజన్న సిరిసిల్ల  జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది.  సిరిసిల్ల లోని తంగళ్ళపల్లి శివారులో మానేర్ నదిలోని చెక్ డ్యామ్ లో అయిదుగురు విద్యార్థులు గల్లంతు కాగా, ఒకరి మృతదేహం లబ్యమైంది.

మానేర్ వాగులోని  చెక్  డ్యాం నీటి లో ఈతకు 8 మంది  విద్యార్థులు సైకిళ్లపై  ఈతకొసం వెళ్లారు. అందులోకి దిగిన విద్యార్థులు చెక్ డ్యాంలో నీరు ఎక్కువగా ఉండడం, నీటి  లోతు తెలియక అందులోనే గల్లంతు కాగా, మిగతా ముగ్గురు విద్యార్థులు భయంతో అక్కడి నుండి పరుగెత్తి వెళ్ళిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. సిరిసిల్ల పట్టణం రాజీవ్ నగర్ నగర్ కు చెందిన గణేష్ మృతదేహం లభించింది.  మిగతా నలుగురి పేర్లు వెంకట సాయి,  క్రాంతి, అజయ్, రాకేష్ లు గా గుర్తించారు.

మిగతా వారి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది  గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.