కరోనా వ్యాక్సిన్ తో నాలుగేండ్ల పక్షవాతం పోయింది

Jharkhand-man-Dularchand

పక్షవాతంతో నాలుగేండ్లుగా మంచానికే పరిమితమైన ఒక వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తో కోలుకున్నాడు. ఈ వింత ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో జరిగింది.

బొకారోలోని సల్గాడిహ్ గ్రామానికి చెందిన దులార్‌చంద్ పక్షవాతం రావడంతో గత నాలుగేండ్లుగా మంచానికే పరిమితమయ్యాడు.

దులార్‌చంద్ ఇటీవల కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. జనవరి 4న వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి తన కాళ్లలో కదలిక వచ్చిందని దులార్ చంద్ చెప్పాడు.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పక్షవాతం నుంచి కోలుకోవడం నమ్మశక్యంగా లేదని బొకారోకు చెందిన సివిట్‌ జర్జన్‌ డాక్టర్‌ జితేంద్ర కుమార్‌ అన్నారు. అయితే దీనిపై శాస్త్రీయంగా పరిశోధన జరగాల్సి ఉందన్నారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమకు కంటి చూపు వచ్చిందని, వినికిడి లోపం పోయిందంటూ గతంలో అనేక సంఘటనలు జరగిన విషయం తెలిసిందే.