స్టాక్ మార్కెట్ లో లాభాల పేరుతో మోసం.. రూ.43 లక్షలు కాజేసిన నేరస్థులు

స్టాక్ మార్కెట్ లో లాభాల పేరుతో సైబర్ క్రైమ్ నేరస్థులు రూ.43 లక్షల కుచ్చు టోపి పెట్టారు. హైదరాబాద్ బేగంపేటకు చెందిన నాగేశ్వర్ రావుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిండు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని ఆశ పెట్టిండు. లాభాలు వస్తె అందులో తమకు 20 శాతం వాటా ఇవ్వాలని సైబర్ నేరగాళ్లు ఆశ చూపిరు.

మాయగాళ్ల మాటలు నమ్మిన నాగేశ్వర్ రావు.. మొదటి దఫా కింద రూ. 7 లక్షలు చెలించాడు. కొన్ని రోజుల్లోనే రూ.7 లక్షల పెట్టుబడికి రూ. 4లక్షల 77వేల రూపాయిలు లాభం వచ్చిందని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసిన చెప్పిండ్రు. ఆ లాభాల్లో రూ.2లక్షల 77వేల రూపాయిలు సదరు వ్యక్తి అకౌంట్ లో జమ చేసి నమ్మకం కల్గించారు.

రెండు రోజుల తరువాత షేర్ మార్కెట్ డౌన్ లో ఉందని,  అత్యవసరంగా రూ.21 లక్ష పెడితే మన షేర్లు నష్ట పొమ్మని చెప్పినారు. సదరు మోసగాళ్ల మాటలు నమ్మిన నాగేశ్వర రావు రెండు దఫాలుగా రూ.16 లక్షలు, రూ.7 లక్షలు మొత్తం రూ.43 లక్షలు నేరగాళ్ల ఖాతాల్లో డిపాజిట్ చేసిండు. షేర్ మార్కెట్ లో ఇన్వెష్ట్ చేసిన డబ్బుతో పాటు లాభం రాకపోవడంతో  ఆలస్యంగా మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిండు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.