రేపు ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం

Fresh water supply to these areas will be disrupted tomorrow in hyderabad

 

Fresh water supply to these areas will be disrupted tomorrow in hyderabad

గ్రేటర్ హైదరాబాద్ లో రేపు పలు చోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద మారుతీ సుజికి షోరూం నుండి దుర్గా వైన్స్ వరకు గల 1600 ఎంఎం డయా ఎమ్ఎస్ మెయిన్ పైపులైన్ కు జంక్షన్ పనులు చేపడుతున్నందున నీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం కలగనున్నట్టు హైదరాబాద్ జలమండలి తెలిపింది. కావున సోమ‌వారం ఉద‌యం 6 గంటల నుండి మరుసటి రోజు మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోనుండడంతో ప్రజలు జాగ్రత్తలు వహించాలని తెలిపింది

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఇవే

1. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 2 – బాలాపూర్, మైసారం, బార్కాస్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
2. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 5 – మేకలమండి, భోలక్ పూర్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
3. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం.7 – తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
4. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 9 – హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ‌, గౌత‌మ్ న‌గ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
5. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 10 – వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
6. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 13 – మ‌హింద్ర హిల్స్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
7. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 14 – ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కాన‌గ‌ర్, బీరప్పగడ్డ రిజర్వాయర్ ప్రాంతాలు.
8. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 19 – బోడుప్పల్ లోని కొన్ని ప్రాంతాలు.
9. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 20 – మీర్ పేట్, బడంగ్ పేట్ రిజర్వాయర్ ప్రాంతాలు.

కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని హైదరాబాద్ జలమండలి తెలిపింది.