రేపు పలుచోట్ల మంచినీటి సరఫరాలో అంతరాయం

 

 

మంజీరా వాటర్ సప్లై ఫేజ్- II, 1500 ఎంఎం డయా పిఎస్సి పైప్‌లైన్‌ను మార్చడానికి జంక్షన్ పనులను చేపడుతున్నందునా.. పటాన్ చెరు, హైదర్‌నగర్ ఏరియాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని వాటర్ బోర్డు తెలియజేసింది.

పటాన్ చెరు నుండి హైదర్‌నగర్ వరకు గల పంపింగ్ మెయిన్, ఎంఎస్ పైప్ లైన్‌ మదీనాగూడ వద్ద వరద నీటి కాలువ, ఇతర లీకేజీ పనుల నిర్మాణ పనుల కారణంగా రేపు ఉదయం 6 గంటల నుండి మే 28, 2021 సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని వాటర్ బోర్డు అధికారులు కోరారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

  1. ఓ అండ్ ఎం డివిజన్ నం 15 – గంగారాం, దీప్తీశ్రీ నగర్, కెఎస్ఆర్ ఎన్ క్లేవ్, అపర్ణ హిల్స్, ఆదర్శ్ నగర్, శాంతి నగర్, మియాపూర్, మైత్రినగర్, మదీనాగూడ, ఉషోదయ నగర్, వైశాలి నగర్, రామకృష్ణ నగర్, సాయిరాం కాలనీ, మియాపూర్ క్రాస్ రోడ్స్, మాతృ శ్రీ నగర్, రాజారాం కాలనీ, అంబేద్కర్ నగర్, జనప్రియ ఫేజ్ 1 & 2, మియాపూర్ విలేజ్, మాధవ్ నగర్, భాను టౌన్ షిప్, నంది కోఆపరేటివ్ సొసైటీ, హుడా మయూరి నగర్, ఎస్సీ బోస్ నగర్, సిర్లా గార్డెన్స్, ఆర్బిఆర్ బాలాజీ నగర్, ఆదిత్య నగర్, శ్రీరంగపురం.
  2. ఓ అండ్ ఎం డివిజన్ నం 9 – హైదర్ నగర్, అడ్డగుట్ట,నిజాంపేట్ మెయిన్ రోడ్, కెపిహెచ్‌బి కాలనీలోని వసంత్ నగర్, రామ్ నరేష్ నగర్.
  3. ఓ అండ్ ఎం డివిజన్ నం 32 – బొల్లారం మున్సిపాలిటీ, ఐలాపుర్ గ్రామం, గండి గూడెం, సుల్తాన్‌పూర్, కిష్టారెడ్డి పేట్, పటేల్‌ గూడ గ్రామం.
  4. ఓ అండ్ ఎం డివిజన్ నం 6 పరిధిలో ఎస్.అర్. నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో లో ప్రెజర్ నీరు వస్తుంది.